by cinetera Posted on 43 views 0 comments

నటీనటులు : విశ్వదేవ్ రాచకొండ, ప్రియాంక జైన్

దర్శకత్వం : ప్రదీప్ కె.కె

నిర్మాత : శ్రీనివాస రావ్ పోట్లురి, ప్రదీప్ కుమార్ కోనేరు

సంగీతం : ప్రదీప్ కె.కె

సినిమాటోగ్రఫర్ : డి.ఆర్. వెంకట్

ఎడిటర్ : ఉపేంద్ర

విశ్వదేవ్ రాచకొండ, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చల్తే చల్తే’. ప్రదీప్ కె.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

సంతోష్ (విశ్వదేవ్ రాచకొండ) ఒక టాక్సీ డ్రైవర్ గా శ్రుతి (ప్రియాంక జైన్) కు పరిచయమవుతాడు. అలా కలిసిన ఇద్దరు కార్ లో ప్రయాణం కొనసాగిస్తారు. ఆ ప్రయాణంలో సంతోష్ శ్రుతిని ఇష్టపడతాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ కొంతకాలం తరువాత శ్రుతి సంతోష్ ను ద్వేషించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో సంతోష్, శ్రుతి తల్లితండ్రులు వీరిద్దరికీ పెళ్లి చెయ్యాలి అనుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది ? సంతోష్ శ్రుతిల మద్య విభేదాలు ఎందుకు వచ్చాయి ? చివరికి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా ? లేదా ? అనేదే ఈ చిత్ర కథాంశం.

హీరో విశ్వదేవ్ మొదటి సినిమా పిట్టగొడ తరువాత చేసిన సినిమా ఇదే. అప్పటికి ఇప్పటికి అతని నటనలో మార్పు కనబడింది. ఇందులో పరిణితి చెందిన అబ్బాయిగా బాగా నటించాడు. రావు రమేష్ క్యారెక్టర్ బాగుంది. హీరో తండ్రి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా జీవితం గురించి ఆయన చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం బాగుంది. హీరోయిన్ ను విలన్స్ వెంటపడితే తప్పించుకోవడానికి హీరోయిన్ లోయలోకి దూకుతుంది. దాన్ని చూసి హీరో ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తాడు ఆ ఎపిసోడ్ సినిమాకు హైలెట్.

ద్వితీయార్థంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ పర్వాలేదు. బ్రేకప్ మాంటేజ్ సాంగ్ బాగుంది. ప్రేమ , పెళ్లి మధ్య తేడా ఏంటి ? పిల్లల ప్రేమలను పెద్దలు ఏలా చూస్తారు ? వారిని ఎలా అర్థం చేసుకుంటారు అన్న విషయాన్ని దర్శకుడు ఒక్క సన్నివేశ లో బాగా చూపించాడు. రావ్ రమేష్ , షియాజి షిండే మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ బాగుంది. ప్రేమ గురించి తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణ బాగుంది.

హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ మరీ పాతగా ఉంది. ఒక అబ్బాయి అమ్మాయిని చూసి ప్రేమించడం ఆ అమ్మాయికి అబ్బాయి కొన్ని కారణాల వల్ల నచ్చకపోవడం చివరికి వీరిద్దరు ఏలా కలిశారు అన్న అంశంతో చాలా సినిమాలు వచ్చాయి. ‘చల్తే చల్తే’ కూడా అదే తరహా కథ, కథాంశాలతోతో తెరకెక్కడం జరిగింది. సినిమా ఎక్కువ భాగం ఒక కార్ లో సాగడం ప్రేక్షకులకు కొంతవరకు బోర్ కొట్టవచ్చు. డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడంతో సినిమా పెద్దగా ఆకట్టుకోదు. అసలు ప్రథమార్థంలో అసలు కథే ఉండదు. ఇంటర్వెల్ ముందు మాత్రమే కథ రివీల్ అవుతుంది. అప్పటి వరకు బోరింగ్ కథనాన్ని భరించక తప్పదు.

ప్రేమ కథల్లో పాటలు ప్రధానంగా బాగుండాలి కానీ ఈ సినిమాలో సంగీతం వినసొంపుగా లేదు. చిన్న కథను ఆసక్తికరంగా చూపించలేకపోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతోందో ఈజీగా ఆడియన్స్ ఊహన్కు అందిస్తుంది. పాత ప్రేమ కథల్లో ఉండే రొటీన్ సన్నివేశాలే ఇందులో ఉంటాయి. ఒక ప్రేమ కథలో ఉండాల్సిన ఫీల్, ఎమోషన్స్ ఈ సినిమాలో లేవు. దర్శకుడు రాసుకున్న సంభాషణలు కూడ అక్కడక్కడా బాగున్నా పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు.

ప్రదీప్ కె.కె ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సంగీతం అందించారు. డైరెక్షన్ పరంగా కొత్త కథని, ఆకట్టుకునే కథనం, సన్నివేశాల్ని అదివ్వక విఫలమైన ఆయన తన నేపధ్య సంగీతంతో పర్వాలేదనిపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా రిచ్ గా చిత్రీకరించడం జరిగింది. ఉపేంద్ర ఎడిటింగ్ వర్క్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ ట్రాక్ కొంతవరుకు ఎడిట్ చేసింటే బాగుండేది. మొదటి పాటకు కోరియోగ్రఫీ బాగుంది. ఆర్.కె వెంకట్ సినిమాటోగ్రఫీ అందంగా ఉంద

Author

cinetera

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *