వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!

by cinetera Posted on 37 views 0 comments

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి రెడీ అని చెప్పడంతో అటు ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అదినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఇరుకున పడ్డారన్న అభిప్రాయం కలుగుతుంది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న పవన్ సూచనకు విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ స్పందించి సై అన్నారు. అంతేకాక ఆయన తన పార్టీ అదికార ప్రతినిధి అంబటి రాంబాబుతో తేదీ కూడా ప్రకటించేశారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్్ పార్టనర్ లని జగన్ చేసిన వ్యాఖ్యపై పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నట్లు కనిపిస్తుంది. అదెందుకో ఆశ్చర్యం కాదు. ఆయన గత ఎన్నికలలో టిడిపి, బిజెపిలకు మద్దతు ఇచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్ని విమర్శలు చేసినా, టిడిపితో సఖ్యతతో ఉంటున్నారన్నది బహరింగ రహస్యమే. ఓటు కు నోటు వంటి కీలకమైన కేసు విషయంలో కాని, దిక్కుమాలిన అనైతిక పిరాయింపు రాజకీయాలకు కాని చంద్రబాబు పాల్పడినప్పుడు పవన్ కళ్యాణ్ నోరెత్తి మాట్లాడలేదు. అంతదాకా ఎందుకు జగన్ ను అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారే కాని,చంద్రబాబును డిమాండ్ చేయలేదు. ఆ మాట కు వస్తే గత వారం రోజులలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు పేరు ప్రస్తావించిందే తక్కువ అని చెప్పాలి.అంతేకాక చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ మనోడే అని వ్యాఖ్యానించారు. పవన్ ను ఏమి అనవద్దని ఆయన తన పార్టీ నేతలకు సూచించారు.దాని తగ్గట్లుగానే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరింది పవన్ కళ్యాణ్ అయితే, చంద్రబాబు మాత్రం జగన్ పై విమర్శలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అనడమే పెద్ద ఉదాహరణ.పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం ఎమ్.పిలను కాని, కేంద్రంలో ఉన్న ఇద్దరు టిడిపి మంత్రులను కాని రాజీనామా చేయాలని డిమాండ్ చేయకపోవడం గమనించవలసిన అంశమే. ఈ నేపద్యంలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ప్రస్తుతానికి భాగస్వాములు అని అంటేపెద్దగా బాధపడనవసరం లేదు. మరో విదంగా చూస్తే పవన్ కళ్యాణ్ తనను చంద్రబాబు బాగస్వామి అనిపించుకోవడం ఇష్టపడడం లేదని, చంద్రబాబుకాని, టిడిపి కాని ప్రజాదరణ కోల్పోతున్న తరుణంలో తనకు కూడా ఈ అవహేళన ఎందుకు అని అయినా ఆయన అనుకుని ఉండాలి.ఈ విషయాలు పక్కన బెడితే అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు వెనక్కి తగ్గిట్లు స్పష్టంగా కనిపిస్తుంది.అలాగే కేంద్రంలో మంత్రులు రాజీనామా చేయించడానికి కూడా వెనుకాడుతున్నారు. కేంద్రంలో ఉంటూనే మోడీని, బిజెపిని భ్రస్టు పట్టించాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర క్యాబినెట్ లో ఉంటూ ఎపి ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి చంద్రబాబు ను బ్రష్టు పట్టించాలన్నది బిజెపి వ్యూహంగా ఉంది.అందువల్లే ఇద్దరు చీదరగా విమర్శలు చేసుకుంటున్నా, మంత్రులు గా మాత్రం కొనసాగుతున్నారు. ప్రజలను ఇరు పక్షాలు మోసం చేసే పనిలో ఉన్నాయని అనుకోవాలి.కాంగ్రెస్ విభజన చేసి నష్టం చేస్తే, బిజెపి విభజన హామీలు తీర్చకుండా నష్టం చేసిందని, రెండూ ఒకటే అన్న చందంగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే టిడిపి మరీ విజృంబించి బిజెపిపై ప్రచారం చేస్తోంది. మూడున్నర లక్షల కోట్లు ఇవ్వవలసి ఉండగా, కేవలం పదమూడు వేల కోట్లే ఇచ్చారని అబియోగాన్ని మోపుతూ ప్రచారం సాగిస్తోంది.ఇదే సమయంలో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మాత్రం ఇప్పటికైతే వెనుకంజ వేస్తున్నారు.కేంద్ర మంత్రి సుజనా చౌదరి కి ఈ విషయం అంత ఇష్టం లేదని చెబుతారు. కొంతమంది టిడిపి నేతలు తాము హద్దుదాటిపోయామని శంకిస్తున్నారట.మరో మంత్రి అశోక్ గజపతి రాజు అయితే ఆంద్రప్రదేశ్ తో తనకు సంబందం లేదన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇక బిజెపిలో సోము వీర్రాజు మరికొందరు మాత్రమే టిడిపిపై గట్టిగా విమర్శలు చేస్తున్నారు. మిగిలినవారిలో ఎక్కువ మంది టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకే విధేయులుగా ఉన్నారు.దాంతో బిజెపి ఆత్మరక్షణలో పడింది.ఇప్పటికైతే చంద్రబాబు తన మంత్రులతో రాజీనామా చేయించకపోయినా, అవిశ్వాస తీర్మానం పెట్టకపోయినా,బిజెపిని ప్రజలలో పలచన చేయడం వరకు చంద్రబాబు సఫలం అయ్యారు. ప్రధాని మోడీ, బిజెపి అద్యక్షుడు అమిత్ షా లు ఎపి వ్యవహారాలపై దృష్టి పెట్టలేదో,లేక మాచ్ పిక్సింగో కాని, బిజెపి బద్ నామ్ అవుతున్నా చంద్రబాబు ను కేంద్ర స్థాయిలో పల్లెత్తు మాట అనడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు కనబడడం లేదు. దీంతో బిజెపిపై ధైర్యంగా అవిశ్వాసం పెడతామని ప్రకటించిన పార్టీగా ఐఎస్ ఆర్ కాంగ్రెస్ నిలబడింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి చేస్తారో చూడాల

Author

cinetera

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *