అవినీతిపై ప్రజా ఆయుధం లోకాయుక్త చట్టం

by cinetera Posted on 111 views 0 comments
Court-stuff

అవినీతిపై ప్రజా ఆయుధం లోకాయుక్త చట్టం

1983 ఆగస్టు 25న రాష్ట్రపతి ఆమోదం పొంది 23.9.83 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ అధిపతుల అవినీతిని అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.
1. ఎవరిపై ఫిర్యాదు చేయవచ్చు?
1. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడికి అనగా గతంలో పనిచేసిన వారైన లేదా ప్రస్తుతం పనిచేస్తున్న వారైనా సహాయ మంత్రులైనా లేదా స్టేట్‌ మంత్రులైన ఈ చట్టం పరిధిలోనికి వస్తారు.

2. ప్రస్తుత లేతా మాజీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు మరియు వారికి సంబంధించిన రెండు సభలలోని ఛీఫ్‌ విప్‌లు.

3. ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి నియమించబడిన అందరు అధికారులు మరియు ప్రజల సేవ కొరకు నియమించబడిన 7400 లేదా అంతకంటే తక్కువ జీతం తీసుకునే అధికారులను మినహాయించి మిగిలిన ప్రజా సేవ కొరకు నియమించబడిన అధికారులందరు.

4. జిల్లా పరిషత్‌ మండల పరిసత్‌ల ఛైర్మన్‌ మరియు వైస్‌ ఛైర్మన్‌లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్లు, ఆంధ్రప్రదేశక మున్‌సపాల్టిdల చట్టం 1965 ప్రకారం నియమించబడిన మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌లు ఈ చట్టం పరిదిలోకి వస్తారు. అయితే రెండవ, మూడవ, గ్రేడ్‌కు చెందిన మున్సిపాల్టిd ఛైర్మన్‌లు మినహాయించబ డ్డారు.

5.
ఏదైనా స్థానిక సంస్థ, రాస్ట్ర చట్టంచేత లేదా ద్వారా ఏర్పడిన ఏదైనా కార్పొరేషన్‌ లేదా రాష్ట్ర చట్టంచే నియంత్రించబడు కార్పొరేషన్‌, 1956 కంపెనీ చట్టం సెక్షన్‌ 617 పరిధిలోనికి వచ్చే ఏదైన ప్రభుత్వ కంపెనీ, 1860 సొసైటీ లేదా తెలంగాణా ఏరియా ప్రజా సొసైటీల రిజిస్ట్రేషన్‌ చట్టం 1350 ఎఫ్‌ చే నియంత్రించబడు సొసైటీ.

6. జిల్లా కంటే తక్రువ కాకుండా కార్యకలాపాలు విస్తరించబడిన లేదా రాష్ట్రమొత్తం వ్యాప్తి చెందిన పరిధి కల్గిన 1964 సహకార సంఘాల చట్టం ప్రకారం రిజిష్టర్‌ చేయబడిన లేదా రిజిస్టర్‌ చేసినట్లు భావించబడిన ఏదైన సహకార సంఘం యొక్క డైరెక్టర్లు.

ఏ అంశాలను లోకాయుక్త విచారణ చేస్తుంది?
1. మంత్రి లేదా కార్యదర్శి, రాష్ట్ర శాసనసభ లేదా మండలి సభ్యుడు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయరు, లోకాయుక్తచే సంప్రదించబడి గవర్నమెంటుచే నీటిఫై చేయబడిన గ్రూపుకు సంబంధించిన ప్రభుత్వ సేవకులచే ఆమోదింపబడి లేదా ఆజ్ఞ ప్రకారం చేయబడిన అన్ని చర్యలు (లోకాయుక్త పరిశోధించవచ్చు) ఎప్పుడైతే ఫి ర్యాదు ద్వారా వివాదాస్పదం చేయబడినవో అవి లోకాయుక్తచే పరిశోధన చేయవలసిన అవసరం ఉన్నదని భావించబడినపుడు లోకాయుక్త పరిశోధన చేయవచ్చును.

2. పైన చెప్పబడిన అధికారుల చర్యలను మినహాయించి మిగిలిన ప్రజా సేవకుల చర్యలపై ఫిర్యాదు వచ్చి అవి పరిశోధించదగినవిగా ఉప లోకాయుక్తచే భావించబడిన యెడల వాటిని ఉపలోకాయుక్తచే పరిశోధన జరపవచ్చు.

3. ఈ పరిశోధన ఉపలోకాయుక్త ఎవరు ఫిర్యాదు చేయకపోయినా తన పరిధిలోనికి వచ్చే అంశాలపై స్వయంగా విచారణ జరపవచ్చు. అఇయతే జైలులోగాని, పోలీసలు క స్టడీలోగాని, శరణాలయంలోగానీ లేదా మానసిక రోగుల ఆశ్రమం నుంచి వచ్చే ఉత్తరాలను లోకాయుక్త ఫిర్యాదుగా స్వీకరించవచ్చును. వార్తా పత్రికల ఆధారంగా కూడా విచారణ చేపట్టవచ్చు.4. ఒకటి కంటే ఎక్కువ మంది ఉపలోకాయుక్తలు ఉన్నప్పుడు లోకాయుక్త ఒక ఉత్తర్వు ద్వారా వారికి మధ్య పని విభజన చేయవచ్చును.

గమనిక :
1. ప్రజా సేవకుల ఎంక్వయిరీ చట్టం 1850, కండిషన్స్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ చట్టం 1982 ప్రకారం కాని ఏవైనా విచారణ జరుపుతున్నట్లయితే వాటిని లోకాయుక్త విచారించకూడదు.

కాలపరిమితి : ఆరోపణ చేయబడిన సంఘటన జరిగిన 6 సంవత్సరాలలోపు ఆ సంఘటనపై ఫిర్యాదు చేయవలెను. ఈ కాలపరిమితి దాటితే సాధారణంగా లోకాయుక్త లేదా ఉపలోకాయుక్త విచారణ జరపదు. అయితే పరిస్థితిని బ ట్టి లోకాయుక్త కాలపరిమితికి మినహాయింపు ఇవ్వవచ్చు.

దేనిపై ఫిర్యాదు చేయవచ్చు?
ఏదైనా చర్యకు సంబంధించి ఎవరైనా వ్యక్తి లోకాయుక్తగాని, ఉపలోకాయుక్తగాని ఫిర్యాదు చేయవచ్చును. ఈ ఫిర్యాదు చేసే చర్య ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యతనలను నెరవేర్చే సమయంలో వెలువరించే నిర్ణయంగాని, సిఫార్సుగాని లేదా ఏదైనా పరిశోధనా ఫలితాన్ని లేదా ఆ చర ్యకు సంబంధించి ఏదైనా ఒక పనిని వదిలివేయడంగాని లేదా చేయడంగాని జరిగితే దానిని మరియు అన్ని ఇతర చర్యలకు సంబంధించిన వ్యక్తీకరణలను ఫిర్యాదు చేయవచ్చును. ఈ ఫిర్యాదులో ఆ సంబంధిత ఆ ప్రభుత్వ ఉద్యోగి తన పదవిని లేదా హోదాను స్వలాభం కోసం లేదా తన శ్రేయస్సు, అతని తరపు కోసం లేదా ఇతరుల శ్రేయస్సు కోసం ఇతరులకు హానిగాని లేదా కష్టాలకు గురిచేస్తే అవినీతికి లేదా అక్రమ లక్ష్యాల కొరకు ప్రేరేపించబడి తన ప్రభుత్వం ఉద్యోగాల బాధ్యత నెరవేచ్చే సమయంలో ప్రభుత్వానికి గాని లేదా ప్రజలకు గాని. ప్రజలలో ఒక భాగానికి గాని హాని చేసిన లేదా అవినీతి ఆరోపణలు లేదా ఆ ప్రభుత్వ ఉద్యోగాల బాధ్యత నిర్వర్తించు సమర్థత లేదని ఫిర్యాదులో ఆరోపణ చేయవచ్చు.ఫిర్యాదు ఎలా చేయాలి?
ప్రభుత్వాధికారుల అవినీతిపై ఫిర్యాదు చేయువారు ఫిర్యాదు నమూనా ఫారం 1ను పూర్తిచేసి, దాన్ని దృవపరుస్తూ ఉన్న ఫారం 2పై సంతకంచేసి, న్యాయవాదిచే లేదా గెజిటెడ్‌ ఆఫీసర్‌చే అటెస్ట్‌ చేయించి పంపవలెను. ప్రజా సమస్య అయితే తెల్లకాగితంపై కూడా రాసి పంపవచ్చు.

లోకాయుక్త విచారణ – నివేదిక:

లోకాయుక్త తనకు అందిన ఫిర్యాదులను పరిశీలించి ఆ ఫిర్యాదులో పూర్తిగాగాని, పాక్షికంగాగాని వాస్తవం ఉందని సంతృప్తి చెందితే, తను కనుగొన్న విషయాలను లేదా సిఫార్సులను, సంబంధిత డాక్యుమెంట్స్‌ను, ఇతర వివరాలను సాక్ష్యాదారాలను రాత పూర్వకంగా సంబంధిత సమర్థ అధికార గణానికి తెలియజేస్తాడు.
2. ఆ నివేదిక అందుకున్న సమర్థ అధికారగణం తదుపరి విచారణ చేయకుండానే లోకాయుక్త లేదా ఉపయుక్తల సిఫార్సుల ఆధారంగానే చర్య తీసుకుని లేదా తీసుకోబోవు చర్యను ఆ నివేదిక అందుకున్న 3 నెలలోపు లోకాయుక్తకు లేదా ఉప లోకాయుక్తకు అందజేయుదురు.
3. లోకాయుక్త లేదా ఉప లోకాయుక్త ఈ చట్టంలో నిర్వచించబడిన ప్రజా సేవకులు అనగా సెక్షన్‌ 2(కె) లోని బస్‌ (4),(5) నిర్వచనంలోకి వచ్చే వారిపై, వారి వారిని ఆ పదవి నుంచి తొలగించుట లేదా తదుపరి ఏ విధమైన ప్రభుత్వ పదవికి ఎన్నిక కాకూడదని నిషేధం విధించవచ్చు.

విచారణ పద్ధతి:
1. ఫిర్యాదు కాపీని సంబంధిత నిందిత ఉద్యోగస్తుడికి మరియు సంబంధిత అధికారికి పంపుతారు.
2. ఆ ఫిర్యాదుపై నిందిత ఉద్యోగస్తుడి యొక్క వివరణను మరియు అతని వాదనను వింటారు.
3. అవసరానికి తగిన విధంగా సంబంధిత డాక్యుమెంట్లను రక్షణ కల్పించమని ఆదేశిస్తారు.
4. కేసు ప్రాథమిక విచారణ దశలో ఉండగా, విచారణ రహస్యంగానూ, వ్యక్తిగత వ్యవహారంగాను జరుగుతుంది. కాని విచారణ ప్రారంభమైన తరువాత బహిరంగంగానే జరుగుతుంది. కాని విచారణ ప్రారంభమైన తరువాత బహిరంగంగానే జరుగుతుంది. ఫిర్యాదుదారుని పేరు కూడా ప్రాథమిక పరిశీలన సమయంలో రహస్యంగానే ఉంచుతారు.
5. ప్రతి ఫిర్యాదుపైన 6 నెలలలోపు విచారణ పూర్తి చేస్తారు. ఏవైనా తగిన కారణాలు ఉన్నట్లయితే మరియు ఏదైనా ఇతర కారణాలు ఉన్నట్లయితే సంవత్సరంలోపు విచారణ పూర్తిచేయవలెను. విచారణ చేయ సమయం సంవత్సరం దాటరాదు.

కేసు – ముగింపులోకాయుక్తలో కేసు రెండు రకాలుగా ముగించబడుతుంది.
1. లోకాయుక్త లేదా ఉపలోకాయుక్త ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సంతృప్తి చెందినట్లయితే ఆ కేసును మూసివేసి ఆ విషయాన్ని ఫిర్యాదుదారునికి సంబంధిత సమర్థ అధికార గణానికి తొలగించబడిన ప్రజా సేవకుడు తెలియజేస్తారు.
2. ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న శిక్షా చర్యలలో సంతృప్తి చెందనట్లయితే మరియు ఆ కేసుకు తగిన అర్హత ఉందని భావించినట్లయితే ప్రత్యేక రిపోర్టును తయారుచేసి గవర్నరుకు మరియు ఫిర్యాదుదారునికి తెలియజేస్తారు.
అలాగే ప్రతి సంవత్సరం లోకాయుక్త, ఉప లోకాయుక్తలు ఆ సంవత్సరం తీసుకున్న చర్యల గురించి గవర్నరు వార్షిక నివేదికను సమర్పిస్తారు. అలా అందుకున్న నివేదికలపై గవర్నరు తన వివరణల పత్రంతో రాష్ట్ర శాసనసభలముందు ఉంచుతారు.

ఫిర్యాదు – తిరస్కరించుట
1. ఫిర్యాదుదారు దురుద్దేశంతో కూడినట్లయితే లేదా పరిశోధనకు తగిన అంశాలు లేనట్లయితే విచారణను తిరస్కరించుటగాని, నిలిపివేయుటగాని చేయవచ్చు.
2. ఒకవేళ ఫిర్యాదుదారునికి ఇతర రూపాల్లో ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్లయితే ఈ పద్ధతుల ద్వారా ఉపశమనం పొందమని లోకాయుక్త ఆదేశించవచ్చు.
దేనిపై లోకాయుక్త విచారణ జరుపుతుంది?
ఒక ప్రజాధికారి తన బాధ్యతలను నిర్వహిస్తూ ఏదైనా నిర్ణయం, సిఫార్సులేక ఫైండింగ్‌ రూపంలో ఏదైనా ఒక విషయం వదలివేయటంగాని, దహారుపరచడంగాని ఆ పని ద్వారా జరిగినట్లయితే దానిని ఈ చట్టం పరిధిలోనికి వచ్చే చర్య(యాక్షన్‌) అని అందురు.

ఆరోపణ
ఒక అధికారి తన హోదాలను దుర్వినియోగపరిచి ఏదైనా లాభంగాని సౌకర్యంగాని పొంది, దాని వలన ఏదైనా వ్యక్తి హానిగాని కష్టంగాని కల్గించినా లేదా ప్రజాధికారిగా తన బాధ్యతలను నిర్వహించే క్రమంలో అవినీతి లేదా అనుచిత ఉద్దేశాన్ని ప్రేరేపించబడి ఫలితంగా ప్రభుత్వంగాని ఏదైనా సభ్యులుగాని లేదా ప్రజల్లో ఒక భాగాన్ని గాని లేదా అవినీతి ఉద్దేశంగాని ప్రజాధికారిగా అసమర్థుడిగా చేర్చిన దానిని ఆరోపణ అంటారు.

లోకాయుక్త – ప్రయోజనాలు

1.లోకాయుక్తకు అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం అసమర్థత వలన కలుగు సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చును. వీటిని ప్రజల సమస్యలుగా భావించి లోకాయుక్త పరిష్కరిస్తుంది.

2.ప్రజలకు పరిపాలకుల అసమర్థత , నిర్లక్ష్యం వలన ఉత్పన్నమైన సమస్యలను తెల్లకాగితంపైనైనా వ్రాసి లోకాయుక్తకు పంపవచ్చు. ఫీజు చెల్లించకపోయినను పరిస్థ్థతిని బట్టి లోకాయుక్త సమస్యను స్వీకరించవచ్చును.

3. మిగిలిన న్యాయ స్థానముల వలె ఈ లోకాయుక్తకు కేసుకు విచారణకు కోర్టు చుట్టూ ఎక్కువసార్లు తిరగనవసరం లేదు.

4. ఫిర్యాదు ప్రాథమిక విచారణ దశలో ప్రతి వాయిదా తేదీన ఈ సంస్థ ముందు హాజరు కానవసరం లేదు.

5. లోకాయుక్త అప్పుడప్పుడు క్యాంపు కోర్టులు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తూ ఉంటారు. అనగా విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం లాంటి ముఖ్య పట్టణాలలో క్యాంపు కోర్టులు నిర్వహిస్తుంటారు. ఆయా తేదీలను ముందుగానే ప్రకటిస్తారు కనుక హైదరాబాద్‌ వచ్చి లోకాయుక్తకు ఫిర్యాదు చేయలేని వారు క్యాంపు కోర్టులలో సంప్రదించవచ్చు. పోస్టల్‌ ద్వారా కూడా ఫిర్యాదును పంపవచ్చు.

6.లోకాయుక్త తీర్పుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో తప్ప మిగిలిన ఏ కోర్టులోనూ అప్పీలు దాఖలు చేయకూడదు.
7. లోకాయుక్త కోర్టులో కేసులు తెలుగులోనే వాదించబడును. లాయరు ద్వారా కాని, నేరుగాగాని సంప్రదించవచ్చు. కేసు విచార ణా పద్దతి సరళంగా ఉంటుంది.

ఫీజు : లోకాయుక్తకు చేయు ఫిర్యాదుతోపాటు రు. 150 లు ఫీజు చెల్లించవలెను. ఈ రుసుమును మనియార్డర్‌ ద్వారాకాని, బ్యాంకర్స్‌ చెక్‌ ద్వారాగాని లేక డిమాండ్‌ డ్రాప్టు ద్వారా గాని సంస్థ రిజిస్ట్రారు గారి పేరున పంపవలెను. హైదరాబాద్‌లో స్వయంగా ఫిర్యాదు దాఖలు చేయువారు ఫీజు డబ్బు రూపంలో చెల్లించి రసీదు పొందవచ్చును.

అయితే లోకాయుక్త సంతృప్తి చెందితే పేదవారికి ఫీజు నుంచి
మినహాయింపు ఇవ్వవచ్చును. అలాగే ప్రజాహిత సమస్యలకు కూడా ఫీజు మినహాయింపు ఇవ్వవచ్చు.

కొన్ని తీర్పులు :ఇటీవల కొన్ని జిల్లాల్లో మైక్రోఫైనాన్స్‌ సంస్థలు జరుపుచున్న ఆర్థిక దోపిడీపై విచారణకు ఆదేశించింది. అలాగే మచిలీపట్నం మున్సిపాలిటీల్లో ఉన్న పారిశుధ్యలేమిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అవసరమైన అన్ని నివారణా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

గురజాడ గ్రామంలో సిమెంటు రోడ్డుకు డబ్బులు మంజూరు అయినప్పటికీ రహదారిని ఏర్పాటు చేయలేదు అని అందిన ఫిర్యాదుపై లోకాయుక్త విచారణ చేయగా అధికారులు స్పందించి ఒక నిర్దిష్ట తేదీలోపు పూర్తి చేస్తామని హామీ ఇవ్వగా లోకాయుక్త ఫిర్యాదు ముగించింది.

కర్నూలు పట్టణంలో జరుగుతున్న మట్కా, జూదం అరికట్టడానికి పోలీసులు చర్య తీసుకోవడంలేదని ఫిర్యాదు అందగా, పోలీసు అధికారులు లోకాయుక్తకు వారు తీసుకున్న చర్యలు నమోదు చేసిన కేసు వివరాలు తెలపగా లోకాయుక్త ఫిర్యాదు ముగించింది.

ఎమ్మిగనూరు పట్టణ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సిటిజన్‌ చార్టర్‌ బోర్డును ఏర్పాటు చేయుటకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేయవలసినదిగా అందిన అధికారులకు తగు ఆదేశాలను జారీ చేయవలసినదిగా అందిన ఫిర్యాదుపై లోకాయుక్త విచారణ జరిపి ఆ బోర్డు ఏర్పాటు చేయమని లోకాయుక్త అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలకు అనుగుణంగా అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు.