by cinetera Posted on 128 views 0 comments
gurukulam

గు రు కు ల భే రి

TG CET – 2019

SC, ST, BC & General
గురుకులాల విద్యాలయాల్లో మన పిల్లలను చేర్చుదాం !
ప్రపంచాన్ని జయించే జ్ఞాన సైనికులుగా తయారు చేద్దాం !!

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు

ప్రియమైన తెలంగాణ తల్లిదండ్రులారా..

తరతరాల బానిసత్వం అంతమవ్వాలంటే, మన బతుకులను కమ్ముకున్నటువంటి అందకారం తొలగిపోయి వెలుగుల వైపు పయనించాలంటే, మన కుటుంబాలు పేదరికం నుండి బయటపడి ఆర్థికంగా సామాజికంగా మెరుగుపడాలంటే.. మన పిల్లలను గురుకుల విద్యాలయాల్లో చేర్పించటం ఒక్కటే మార్గం.

Dr. R. S. ప్రవీణ్ కుమార్ స్వేరో IPS, శ్రీ మల్లయ్య భట్టు, శ్రీ సత్యనారాయణ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారుల నాయకత్వంలో సమర్థవంతంగా నడుస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బి.సి.వెల్ఫేర్ మరియు జనరల్‌ గురుకులాల్లో 2019 – 20 విద్యా సంవత్సరానికి గాను ఇంగ్లీష్ మీడియం 5వ తరగతిలో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నోటిఫికేషన్ (VTG CET – 2019) విడుదల చేసిన విషయం తెలిసిందే. కావున గతంలో మాదిరిగా విస్త్రతంగా ప్రచారం చేసి పేద తల్లిదండ్రులకు విద్యార్థులకు అండగా వుండవలసిన భాద్యత నిరంతరం విద్యార్థులు ఉపాధ్యాయుల హక్కుల కోసం మరియు గురుకులాల పరిరక్షణ కోసం పోరాడుతున్న TGPA పై వుంది.

కాబట్టి జ్ఞానులైన తల్లిదండ్రులారా..

? మీ పిల్లలకు ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్ విద్య, నాణ్యమైన భోజన సదుపాయాలు, ఎల్లవేళలా అందుబాటులో వుండే మంచి వైద్యం కోరుకుంటున్నారా ❓
? ప్రభుత్వ పాఠశాలల్లో చదువు బాగలేక, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారా ❓
? సంవత్సరానికి లక్ష యాబై వేల రూపాయలు ఆదా చేయాలనుకుంటున్నారా ❓
? మీ బిడ్డలు వారికి నచ్చిన రంగంలో స్వేచ్చగా ఎదిగి జీవితంలో ఉన్నతస్థాయిలో వుండాలనుకుంటున్నారా ❓
? మీ బిడ్డలు భవిష్యత్తులో IAS, IPS, IFS, కలెక్టర్లు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, వ్యాపారవేత్తలు, సైనికాధికారులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు మరియు వివిధ రంగాల్లో సెలబ్రిటిస్ కావాలని కలలుకంటున్నారా ❓
? మీ బిడ్డలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విదేశాలలో చదవాలని కోరుకుంటున్నారా ❓
? మీ పిల్లలు భారతదేశ రక్షణ రంగంలో చేరి గొప్ప సైనికులుగా సైనికాధికారులుగా దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా ❓
? మీ బిడ్డలు IIT, NIT మరియు దేశ విదేశాలలోని గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువాలనుకుంటున్నారా ❓
? మీ బిడ్డలు స్వేరోగా మారి మహనీయుల అడుగు జాడల్లో నడిచి అందరికీ ఆదర్శంగా వుండాలని కోరుకుంటున్నారా ❓

… అయితే మీ పిల్లల కోసం కేవలం 100/- తో మీ దగ్గరలోని ఆన్‌లైన్ సెంటర్ లో తక్షణమే గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయండి.

దరఖాస్తు గడువు: ఆన్‌లైన్ ద్వారా తేది 18-02-2019 నుండి 10-03-2019 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును.

ప్రవేశ పరీక్ష తేది: 07-04-2019 నాడు ఉదయం 11:00 గం.ల నుండి మధ్యాహ్నం 1:00 గం. వరకు

కావలసినవి:
1. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
2. ఆధార్ కార్డ్
3. అభ్యర్థి సంతకం

వెబ్‌సైట్: http:/tgcet.cgg.gov.in

గురుకులాల ప్రత్యేకతలు:

1. సమర్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులు అయిన ఉపాధ్యాయులచే బోధన.
2. 24 గంటలు ఉపాధ్యాయుల పర్యవేక్షణ.
3. IIT, EAMCET, NEET లాంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించటం.
4. అధిక సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో MBBS, BDS లలో ప్రవేశాలు పొందేలా ఉత్తమ శిక్షణ.
5. సెంట్రల్ యూనివర్సిటీలు, TISS వంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా పోటీ పరీక్షలకు వేసవి క్యాంపుల ద్వారా శిక్షణ.
6. విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి హౌస్ మాస్టర్/హౌస్ పేరెంట్ వ్యవస్థ.
7. పాఠ్యాంశాలతో పాటు సహా పాఠ్యాంశాలు, క్రీడలు మొదలగు వాటిపై ప్రత్యేక శ్రద్ధ.
8. శారీరక విద్యా (ఫిజికల్ ఎడ్యుకేషన్), యోగాలో శిక్షణ.
9. అన్ని ప్రభుత్వ పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం.

విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు:

1. సన్న బియ్యంతో సహా అన్ని పోషక విలువలు ఉన్న చక్కటి రుచికరమైన ఆహారం అందించుట.
2. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఉచిత సరఫరా.
3. విద్యార్థులకు స్టేషనరీ పెన్నులు, పెన్సిల్స్, రికార్డు పుస్తకాలు వగైరా ఉచిత సరఫరా.
4. మూడు జతల స్కూల్ యూనిఫాం సరఫరా.
5. పి.టి డ్రెస్, ట్రాక్ షూట్, స్పోర్ట్స్ షూ మరియు ఇతర సౌకర్యాల కల్పన.
6. ప్లేట్, గ్లాస్, బెడ్సిట్స్, బ్లాంకెట్ల ఉచిత సరఫరా.
7. విద్యార్థిని విద్యార్థులకు సబ్బుల కొనుగోలుకు పైసల పంపిణీ మొదలైనవి.
8. నెలకు 4 పర్యాయాలు, చికెన్ 2 పర్యాయాలు మటన్ తో భోజనం.

భవిష్యత్తులో ఏ ఉద్యోగాలకు డిమాండ్ వుంటుందో, ఏ పని చేస్తే చక్కగా జీవించగలుగుతారో, ఏ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందో వాటికి కావలసిన చదువులను నైపుణ్యాలను విద్యార్థులకు “మెరుగైన శిక్షణ – మేలైన సంరక్షణలో” పూర్తిస్థాయిలో అందించే గురుకులాల్లో మీ బిడ్డలను చేర్పించండి.

ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు ❓
మనం కాకపోతే.. ఇంకెవరు ❓
కదులుదాం.. మన బిడ్డల బంగారు భవిష్యత్తుకై ❗

Author

cinetera

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *